Tuesday, 16 February 2021

సర్కారు వారి పాట: సూపర్ స్టార్ అభిమానుల కోసం సర్‌ప్రైజింగ్ ట్రీట్ రెడీ చేస్తున్న మహేష్ టీమ్

టీజర్, ట్రైలర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్ లాంటివేనా ప్రమోషన్స్ అంటే.. కాసింత కొత్తగా ట్రై చేద్దామని భావిస్తోందట '' టీమ్. ఈ మేరకు సూపర్ స్టార్ అభిమానుల కోసం సర్‌ప్రైజింగ్ ట్రీట్ రెడీ చేస్తున్నారట. ప్ర‌స్తుతం దుబాయ్‌లో సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జరుపుతున్న యూనిట్, ఈ షెడ్యూల్‌లో మహేష్‌, కీర్తి సురేష్‌ల‌పై కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 21నాటికి ఈ షెడ్యూల్ పూర్తిచేసుకొని తిరిగి రానుంది యూనిట్. అదే రోజు ఓ చిన్న వీడి‌యోను విడుద‌ల చేయాలని `స‌ర్కారువారి పాట` టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇందులో లొకేష‌న్‌కు సంబంధించిన కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ ఉంటాయ‌ని స‌మాచారం. సినిమాకు ప్రమోషన్స్ దక్కడమే గాక లొకేషన్స్ పరంగాను ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగుతుందని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని తీసుకొని ఈ కథ రాసుకున్న పరశురామ్.. షూటింగ్‌లో చాలా జాగ్రత్త వహిస్తున్నారట. ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కెమెరాలో బందిస్తున్నారట. కామెడీకి పెద్ద పీట వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిసింది. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jRKgxu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...