Thursday, 4 February 2021

ఆమె భర్తతో ఈమె.. ఈమె భర్తతో ఆమె.. ఈ ఇద్దరూ లెస్బియన్.. మర్డర్ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

కొత్తగా పెళ్లి చేసుకుని అపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టిన యువ జంట.. ఏమైందో ఏమో ఆమె భర్తను దారుణంగా గొంతుకోసి.. కసితీరా పొడిచి చంపేస్తారు. పక్కనే భార్య ఏడుస్తూ నా భర్తను ఎవరో చంపేశారని కన్నీరు మున్నీరౌతుంటుంది. బీరువా కూడా పగలగొట్టి ఉండటంతో దొంగల పని అనే అయ్యి ఉంటుందని ఇన్విస్టిగేషన్ చేసే పోలీస్ అధికారి ప్రాధమిక అంచనాకు వస్తాడు. ఎంక్వైరీలో భాగంగా.. మీ ఆయనకు ఏమైనా గొడవలు ఉన్నాయా?? ఎవరితోనైనా సంబంధం ఉందా? అంటే.. అలాంటివి ఏం లేవు సార్ అని చెప్తుంది ఆ భార్య. ఇంతలో ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి పోలీసుల కంట పడకుండా తనకు కనిపించిన కత్తిని తీసుకుని వెళ్లి బయట డస్ట్ బిన్‌లో పడేస్తుంది? పోలీసులు కదా.. ఆమెను పట్టేస్తారు.. ఆ పనిమనిషితో ఎంక్వైరీ మొదలుపెట్టడంతో పోలీసులు షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటారు. చనిపోయిన వ్యక్తి ఆమెను ఎలా లొంగదీసుకుని ఆమెను ఎలా అనుభవించేవాడో పూసగుచ్చినట్టు చెప్పుకొస్తుంది. వీళ్ల మధ్య జరిగిన రసక్రీడకు సంబంధించి A సర్టిఫికేట్ సీన్ ఉంటుంది ఆమె ఫ్లాష్ బ్యాక్‌లో. అలాగని అతన్ని చంపింది ఆ పనిమనిషి మాత్రం కాదు. ఆమె ఇచ్చిన సమాచారం ద్వారా ఎదురు ఫ్లాట్‌లో ఉండే మరో వ్యక్తిని విచారిస్తారు పోలీసులు. చనిపోయిన వ్యక్తికి ఇతనికి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ రెండో వ్యక్తి అడ్డంగా బుక్ అవుతాడు. అయితే పోలీసు విచారణలో ఇతనికి ఆ చనిపోయిన వ్యక్తి భార్యకు ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుంది. ఆ కోపంతో ఇతనే అతన్ని చంపాడు అంటే పొరపాటు. అక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంటుంది. రెండు జంటల మధ్య కథ.. అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్య.. ఆ హత్య చేసింది ఎవరు? ఆ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారు? మనకి తెలియని నిజాల వెనుక-మనకి తెలియని వాస్తవాలు ఎన్నో.. అవేంటి? అన్నదే ‘ది లస్ట్.. ఎ మర్డర్ మిస్టరీ’లోని మిగిలిన కథ. వర్మ చెక్కిన నగ్నం చిత్రంలో నగ్నంగా నటించిన నటించిన చిత్రమే ది లస్ట్. శ్రీరాపాక, , చత్రపతి శేఖర్, శ్రీగగన్, మేఘనా చౌదరి కీలకపాత్రల్లో నటించిన ఎరోటిక్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ చిత్రమే ‘ది లస్ట్’. ఎస్ కే ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం MXPlayerలో ఉంది. ఇది పక్కా అడల్డ్ కంటెంట్ చిత్రం పెద్దవాళ్లకు మాత్రమే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oNUoZ8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...