Thursday, 4 February 2021

రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డ్ షాక్.. ‘దిశ ఎన్‌కౌంటర్’ విడుదల డౌటే!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది. పర్యవేక్షణలో రూపొందిన ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాను సర్టిఫై చేయడానికి సెన్సార్ బోర్డు కమిటీ నిరాకరించింది. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనను పోలిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉండటంతో సెన్సార్ చేయడానికి కమిటీ సభ్యులు సుముఖత చూపలేదు. నలుగురు సభ్యుల సెన్సార్ బోర్డు ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాను రిజెక్ట్ చేయడంతో చిత్ర నిర్మాతలు రివిజన్ కమిటీ ముందుకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దిశ తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టుకు కూడా వెళ్లారు. దీంతో ఈ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ శివారులో 2019 నవంబర్ 26న జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నలుగురు కామాంధులు అత్యంత క్రూరంగా ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి ఆ తరవాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ తరవాత ఆ నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అయితే, ఈ ఘటన ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ప్రకటించిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ తరవాత మాట మార్చారు. ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమా ట్రైలర్ గతేడాది సెప్టెంబర్‌ 26న విడుదలైన తరవాత అందులోని సన్నివేశాలను చూసిన దిశ తల్లిదండ్రులు సినిమాపై అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే బిడ్డను పోగొట్టుకుని బాధలో ఉన్న తమకు ఈ సినిమా, దానికి వస్తోన్న కామెంట్లు మరింత క్షోభకు గురిచేస్తున్నాయని అన్నారు. ఈ సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా విడుదల కావాలా వద్దా చెప్పాల్సిన బాధ్యతను సెన్సార్ బోర్డుకు అప్పగించింది హైకోర్టు. అయితే, హైకోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని.. సెన్సార్ బోర్డుకు తమ సినిమా చూపించి దిశ మరణించిన రోజు నవంబర్ 26న కచ్చితంగా సినిమాను విడుదల చేస్తామని అన్నారు. ఇది దిశ బయోపిక్ కాదని.. ఆమెపై తీయలేదని బుకాయించారు. ఆమె తల్లిదండ్రుల అనుమతి మేమెందుకు తీసుకోవాలని అన్నారు. లాక్‌డౌన్‌లో ఈ సినిమా సెన్సార్ పూర్తికాలేదు.. సినిమా విడుదల కాలేదు. మొత్తానికి ఇప్పుడు సెన్సార్ బోర్డు వద్దకు వెళ్తే వాళ్లు సర్టిఫై చేయడానికి తిరస్కరించారు. కాగా, ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మాతలు (నట్టి కుమార్ పిల్లలు).


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YLRJo6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...