Thursday, 4 February 2021

గోవాలో ఎంజాయ్ చేస్తోన్న శ్రీముఖి.. విష్ణు ప్రియతో తకిట తదిమి తందాన!

బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన స్టార్ యాంకర్ తాజాగా గోవా విహారయాత్రకు వెళ్లారు. తన ప్రాణ స్నేహితురాలైన యాంకర్ విష్ణు ప్రియతో కలిసి ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు శ్రీముఖి. గోవాలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. కోలా బీచ్ రిసార్ట్‌లో సేదతీరుతోన్న శ్రీముఖి.. అక్కడ ప్రకృతి అందాలను విష్ణు ప్రియతో కలిసి ఆశ్వాదిస్తున్నారు. కోలా బీచ్ రిసార్ట్‌లో తీసుకున్న ఫొటోల్లో శ్రీముఖి బార్బీ డాల్‌లా మెరిసిపోతున్నారు. అలాగే, విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు శ్రీముఖి. ఎప్పటిలానే గట్టి అరుస్తూ రాములమ్మ తన ప్రతాపాన్ని చూపించారు. ఆమెకు తోడవడంతో హంగామా మామూలుగా లేదు. ‘తకిట తదిమి తకిట తమిది తందానా’ అంటూ ఇద్దరూ కలిసి పాటలు పాడుతున్నారు. ఇదిలా ఉంటే, శ్రీముఖి ఇటు బుల్లితెరపై.. అటు వెండితెరపై రాణిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నాగబాబు ‘బొమ్మ అదిరింది’ షోకు యాంకర్‌గా వ్యవహరించారు. ఆ షో ప్రస్తుతానికి ఆగింది. మరోవైపు, తానే స్వయంగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ‘ఓ ఉమెనియా’ టాక్ షో నిర్వహించారు. అది కూడా రెండు నెలలుగా ఆగింది. ఇవి కాకుండా లాక్‌డౌన్ సమయంలో ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అనే వెబ్ మూవీ చేశారు. ఇప్పుడు ‘క్రేజీ అంకుల్స్’ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. See Photos: ఈ సినిమాలో శ్రీముఖితో పాటు సింగర్ మనో, భరణి, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదలైంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అదుర్స్ రఘు, గిరిధర్, హేమ, గాయత్రి భార్గవి, విజయ మూర్తి, వాజ్‌పేయి, మహేంద్ర నాథ్, సింధూరి, మాధురి ఇతర పాత్రలు పోషించారు. డార్లింగ్ సామి కథ, మాటలు అందించిన ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం సమకూర్చారు. పి.బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3axEehs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...