దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. హీరోగా పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ఇక హీరోయిన్ ప్రియమణితో ఆయన వరుస సినిమాలు చేయడంతో ఆమెతో రిలేషన్ నడుస్తుందనే వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయి ఆ తర్వాత సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ప్రియమణిపై జగపతి బాబు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. రీసెంట్‌గా (ఫిబ్రవరి 12) జగపతి బాబు పుట్టిన రోజు జరగడంతో ఆయనకు సినీ ప్రముఖులు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు స్పెషల్ విషెస్ అందించింది ప్రియమణి. అంతేకాదు మళ్లీ ఎప్పుడు కలిసి నటిద్దామని నేరుగా అడిగేసింది. దీనిపై రియాక్ట్ అయిన జగపతి బాబు.. పక్కింటి అమ్మాయిలా ఎంతో సరదాగా మెదిలే ప్రియమణితో మళ్లీ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది. ఎప్పుడైనా సరే నేను ఓకే.. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలని ఉందని అన్నారు. ఇంకేముంది ఈ ఇద్దరి సంభాషణ కాస్త నెట్టింట వైరల్ అయింది. అటు ప్రియమణి కూడా ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో ఈ ఇద్దరి కాంబో మరోసారి చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవలే 'ఫ్యామిలీమెన్' వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్‌లో నటించిన ప్రియమణి.. ప్రస్తుతం వెంకటేష్ సరసన 'నారప్ప' సినిమాలో నటిస్తోంది. అలాగే రానా హీరోగా తెరకెక్కుతున్న 'విరాటపర్వం' సినిమాలో నటిస్తోంది. ఇప్పటిదాకా ఈ సినిమాల నుంచి ఆమెకు సంబంధించిన లుక్స్ రిలీజై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్, సైడ్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్‌లో సత్తా చాటుతున్నాడు. ఆయన నటించిన FCUK విడుదల కాగా, ఇంకొన్ని సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పటి క్రేజీ కాంబో జగపతి బాబు- ప్రియమణి మూవీ రావాలే గానీ ప్రేక్షకులు పండగ చేసుకుంటారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LSpJwg
v
No comments:
Post a Comment