బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు, ఎం.ఎస్. ధోనీ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కో-స్టార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడానికి ముందు ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో పోస్టు చేశారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆ వీడియోలో తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదని అన్నారు. ఇటు వ్యక్తిగత జీవితంలో అటు వృత్తి రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సందీప్ నహర్ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్‌లో మరోసారి అలజడి రేగింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఇప్పటికీ ప్రకంపనలు రేపుతుండగా.. తాజాగా అదే సినిమాలో నటించిన మరో యాక్టర్ ఆత్మహత్య చేసుకొని మరణించడం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ కలచివేస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LTqeGx
v
No comments:
Post a Comment