Sunday, 10 January 2021

Varun Dhawan: పెళ్లిపై వరుణ్ ధావన్ క్లారిటీ.. లవ్ రిజెక్ట్ చేసినా వదల్లేదంటూ బాలీవుడ్ హీరో ఓపెన్

ఓ వైపు కరోనా మహమ్మారి వీర విజృంభణ చేస్తుంటే మరోవైపు వరుసపెట్టి పీటలెక్కారు పలువురు సెలబ్రిటీలు. కరోనా కాలంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లిపై దృష్టి పెట్టేసి ఆ తంతు ముగించేశారు. చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా పలు సీరియల్ నటులు చాలామందే ఉన్నారు. ఇక అదే బాటలో ఈ ఏడాది కూడా మరి కొంతమంది సెలబ్రెటీలు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతుండటం చూస్తున్నాం. ఇప్పటికే ర‌ణ్‌బీర్ క‌పూర్ తన పెళ్లి విషయాన్ని ప్రకటించగా తాజాగా మరో బాలీవుడ్ యువ హీరో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు. గత రెండేళ్లుగా హీరో ముచ్చట్లు బీ టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వరుణ్ ధావన్, ప్రేమించుకుంటున్నారని అతిత్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై స్పందించారు వరుణ్. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిస్థితులు చక్కబడి అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది 2021 లోనే తన ప్రేయసి నటాషా దలాల్‌ని పెళ్లాడతానని కన్ఫర్మ్ చేశారు. నటాషాతో ఏడుఅడుగులు వేయడానికి మంచి ముహూర్తం చూస్తున్నామని అన్నారు. ఈ మేరకు తన ప్రేయసి నటాషా గురించి, ఆమెతో ప్రేమాయణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు వరుణ్ ధావన్. నటాషా తనకు చిన్ననాటి స్నేహితురాలిని, కానీ ఆమెను ప్రేమలో దించడానికి ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పారు. లవ్ ప్రపోజ్ చేసిన ప్రతిసారీ నటాషా రిజెక్ట్ చేస్తుండేదని, అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడి మరీ ప్రేమించానని ఆయన అన్నారు. దీంతో పెళ్లిపై జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39lXzRY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...