Sunday, 10 January 2021

గ్రాండ్‌గా వైవా హర్ష నిశ్చితార్థం.. వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయిన మెగా హీరోలు!

గత కొన్ని నెలలుగా చిత్రసీమలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు యూట్యూబ్ స్టార్, కమెడియన్ . ఈ మేరకు తన నిశ్చితార్ధ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అక్షర అనే అమ్మాయితో అతని ఎంగేజ్‌మెంట్ జరిగింది. కేవలం కొద్దిమంది మిత్రులతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, కొణిదెల సుస్మిత ఈ వేడుకకు హాజరయ్యారని తెలుస్తోంది. తన నిశ్చితార్ధానికి మందు దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైవా హర్ష 'ఇదే లాస్ట్ బ్యాచిలర్ సెల్ఫీ' అంటూ ఆసక్తికర కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రముఖులు, యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా స్టార్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా తన పెళ్లి డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు వైవా హర్ష. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వైవా హర్ష నెటిజన్లకు బాగా దగ్గరయ్యాడు. సోషల్ మీడియా ద్వారా కూడా సినిమాల్లో ఛాన్సులు అందుకోవచ్చని నిరూపించిన వారిలో వైవా హర్ష ఒకరు. కేవలం యూ ట్యూబ్ వీడియోల ద్వారా దాదాపు సెలబ్రెటీల రేంజ్‌లో క్రేజ్ కొట్టేసిన హర్ష.. పలు సినిమా అవకాశాలు పట్టేశాడు. రీసెంట్‌గా వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ సక్సెస్ అయింది. ఈ చిత్రంలో తన నటనతో అందరి మనసు దోచుకున్న వైవా హర్ష ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i0ZhMt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...