Monday, 4 January 2021

Sam Jam: ఇంట్లో పడిఉంటాననే సమంత నన్ను.. సలహాలు తీసుకోదు: సామ్ జామ్‌లో చైతు ఇచ్చిపడేశాడు

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్‌జామ్‌' అపూర్వ ఆదరణ లభించింది. ఓటీటీ వేదిక 'ఆహా'లో ప్రసారమయ్యే ఈ షోలో ఇప్పటి వరకు మెగాస్టార్‌ చిరంజీవితో పాటు అల్లు అర్జున్‌, రకుల్‌, తమన్నా, రానా వంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోకు వచ్చి సందడి చేశారు. కాగా ఈ సీజన్‌ చివరి ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చారు సమంత భర్త, అక్కినేని వారసుడు నాగచైతన్య. రొమాంటిక్ జోడీగా పేరొందిన సామ్-చైతూ రొమాంటిక్ ముచ్చట్లకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 'సామ్జామ్' తొలి సీజన్ చివరి ఎపిసోడ్కు హీరో నాగచైతన్య అతిథిగా వచ్చి.. హోస్ట్ చేస్తున్న తన భార్య సమంతతో కలిసి సందడి చేశారు. చైతూని స్టేజ్ మీదికి తీసుకుని వచ్చిన సమంత.. ‘మొత్తానికి షోకి వచ్చావ్ అని అనడంతో ‘వీడు ఇంట్లోనే పడి ఉంటాడు.. ఎప్పుడైనా వస్తాడులే అనుకుని లాస్ట్‌లో నన్ను పిలిచావ్’ అంటూ పంచ్ వేశాడు నాగ చైతన్య. దీంతో సమంత చిరునవ్వులు చిందించింది. హోస్ట్‌గా తనకు ఎన్ని పాయింట్లు ఇస్తారని సామ్‌ అడుగగా.. 'నేను సలహాలు ఇస్తే నువ్వు తీసుకుంటావా?' ఎందుకంటే నేను ఇంట్లో ఏదైనా సలహా ఇస్తే నువ్ తీసుకోవుకదా అని నవ్వుతూనే గట్టి కౌంటర్‌ వేశాడు చైతూ. ఒకే టైంలో ఎక్కువ మంది అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేశావా?? అని అడగ్గా.. షోకి వచ్చిన చైతూ ఫ్యాన్స్ గోల గోల చేశారు. ఇక నువ్ ఏదో రోజు తప్పు చేసి నా హజ్బెండ్ ఇన్ఫ్లూయెన్స్ చేశాడని మాత్రం చెప్పొద్దని సమంతతో అన్నాడు చైతు. నా హజ్బెండ్ మంచి మూడ్‌లో ఉన్నాడు కాబట్టి.. నా వంటకి ఎన్ని మార్కులు వేస్తావ్ అని సిగ్గుపడుతూ అడిగింది సమంత.. నేను ఎప్పుడూ మంచి మూడ్‌లోనే ఉంటానని రొమాంటిక్ టచ్ ఇచ్చిన చైతూ.. కుకింగ్‌కా.. వాట్ అని అడుగుతూ ఆటపట్టించాడు చైతు. నీ సామ్ జామ్ షోలో గెస్ట్ అయిన నన్ను నువ్ ర్యాగ్ చేయలేవు.. ఎందుకంటే ఈ గెస్ట్‌కి నీ గురించి అన్నీ తెలుసు అంటూ సమంతతో ఆటాడుకున్నాడు చైతూ. జనవరి 8న 'ఆహా'లో చైతన్య-సమంతల ఎపిసోడ్ ప్రసారం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38WaaLK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...