Monday, 4 January 2021

డ్రగ్స్ కేసులో పట్టుబడింది టాలీవుడ్ నటి కాదు.. కన్నడ హీరోయిన్

ముంబైలోని ఓ హోటల్‌లో పోలీసులు జరిపిన దాడుల్లో డ్రగ్స్‌ పెడ్లర్లతో సహా టాలీవుడ్ నటి ఒకరు పట్టుబడ్డారని నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ నటిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు.. ఆమె వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. అయితే, ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన నటి ఎవరు అన్న విషయం సోమవారం బయటికి వచ్చేసింది. ఆ నటి పేరు శ్వేతా కుమారి. అయితే, ఈ విషయాన్ని ఎన్‌సీబీ అధికార్లు ధ్రువీకరించలేదు. అయితే, ఈమె టాలీవుడ్ నటి కాదు.. కన్నడ నటి. తెలుగులో ఈమె పలు చిత్రాల్లో నటించిందని అంటున్నారు.. కానీ వివరాలు ఎవరికీ తెలీదు. కానీ, కన్నడలో మాత్రం 2015లో వచ్చిన ‘రింగ్ మాస్టర్’లో శ్వేతా కుమారి నటించింది. శ్వేతా కుమారి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీ నుంచి సోమవారం ఉదయం తప్పించుకుందని సాయంత్రం మళ్లీ ప్రత్యక్షమైందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఎన్‌సీబీ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. శ్వేతా కుమారిని హోటల్ రూమ్‌లోనే ఎన్‌సీబీ అధికారులు విచారించినట్టు సమాచారం. ఈరోజు ఉదయం కూడా అక్కడే అధికారులు ఆమెను ప్రశ్నించి సాయంత్రం ఎన్‌సీబీ కార్యాలయానికి రప్పించినట్టు తెలుస్తోంది. కాగా, డ్రగ్స్‌ కేసులో నిందితురాలిగా ఉన్న శ్వేతా కుమారికి మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్టు సమాచారం. కరీం లాలాతో కలిసి ఆమెకు డ్రగ్స్ వ్యాపారంలో వాటాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీం లాలా కోసం ఎన్‌సీబీ విసృతంగా గాలింపు మొదలుపెట్టింది. కరీం లాలా దేశం విడిచి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను ఎన్‌సీబీ అప్రమత్తం చేసింది. ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో శ్వేతా కుమారి శనివారం రాత్రి పట్టుబడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన చాంద్‌ పాషా నుంచి 400 గ్రాముల డ్రగ్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో బాంద్రా, కుర్ల, అంధేరిలోనూ అధికారులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/353y4Un
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...