Saturday, 9 January 2021

Love Story Teaser: ఆశ నిరాశల జీవితంలో అందమైన ప్రేమ జంట.. యూత్‌‌కి కనెక్ట్ అయ్యేలా!!

ఫీల్ గుడ్ కథలను తనదైన కోణంలో మలుస్తూ ప్రేక్షకులను మెప్పించగల టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న మరో ప్రేమకథ 'లవ్ స్టోరీ'. ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ అందమైన లవ్ స్టోరీలో , హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా రిలీజ్ చేసి సినిమాపై ఉన్న ఆతృతను రెట్టింపు చేశారు. కేవలం ఒకే ఒక్క నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. లైఫ్‌‌లో సెటిల్ కావడం కోసం ఇటు నాగ చైతన్య, అటు సాయి పల్లవి పడిన కష్టాలు.. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమను శేఖర్ కమ్ముల తనదైన శైలిలో కెమెరాలో బంధించారని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఆశ నిరాశల జీవితంలో ఈ అందమైన ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలాన్ని పెంచేశారు. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అన్ని అంశాల కలబోతగా ఈ లవ్ స్టోరీ రూపొందించారని టీజర్‌తో చెప్పేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ 'లవ్ స్టోరీ' సినిమాను నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bppTWv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...