Sunday, 17 January 2021

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రౌడీ రాకకు ముహూర్తం ఫిక్స్! ఛార్మి ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌‌

టాలీవుడ్ రౌడీ స్టార్ రంగంలోకి దిగుతున్నారు.. అది కూడా రేపే! అంటూ ఆ సమయాన్ని నిమిషాలతో సహా ప్రకటించారు నిర్మాత ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ రేపే రివీల్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన ఆమె.. ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ అభిమానులతో పంచుకున్నారు. పంచ్ రీ- లోడ్ చేసే సమయం వచ్చేసింది. రేపు (సోమవారం) ఉదయం 10 గంటల 8 నిమిషాలకు.. అని పేర్కొంటూ ప్రీ లుక్ పంచుకున్నారు ఛార్మి. బాక్సింగ్ రింగ్‌లో పాయింట్లు చూపించినట్టుగా టైమ్ చూపిస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్‌‌లో చేతికి ధరించే గ్లౌవ్స్ ఉన్నాయి. జనవరి 18వ తేదీ ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఫస్ట్‌లుక్ అండ్ టైటిల్ రాబోతోందని రాసి ఉంది. ఇక ఇదే విషయాన్ని తెలిపిన పూరి కనెక్ట్స్ టీమ్ ''మునుపెన్నడూ చూడని అద్భుతమైన కథలను గత కొన్ని సంవత్సరాలుగా మీకు అందిస్తున్నాం. భాషా పరిమితులు లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేసేవిధంగా చాలా చిత్రాలు రూపొందించాం. మా ఈ ప్రయాణంలో రేపు మరో సినిమా పేరు ప్రకటించబోతున్నాం'' అని పేర్కొంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్. పూరి జగన్నాథ్- విజయ్ కాంబో కావడంతో ఈ మూవీపై విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LWacvh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...