Sunday, 17 January 2021

RED చూశాక రామ్ ఫ్యాన్ అయ్యా.. ఆయన కారణంగా అందరి నోటా అదే పిలుపు.. హాట్ బ్యూటీ మాళవిక శర్మ

ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ హీరోగా రూపొందిన సినిమా RED. సస్పెన్స్ థ్రిల్లర్‌ కథతో కిషోర్ తిరుమల ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా మలిచారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సక్సెస్‌తో ఫుల్ ఖుషీ అవుతున్న చిత్రయూనిట్ వైజాగ్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో హీరోయిన్ స్పీచ్ రామ్ అభిమానులను హుషారెత్తించింది. మాళవిక శర్మ మాట్లాడుతూ.. ''స్రవంతి మూవీస్‌తో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఈ టీమ్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ కిషోర్ సార్ మూలంగా ప్రజలు నన్ను మహిమా (చిత్రంలో ఆమె పేరు) అనే పేరుతో పిలవడం ప్రారంభించారు. అలాంటి మంచి రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇక ఈ చిత్రం చూశాక రామ్‌కి పెద్ద అభిమానిని అయిపోయాను. ఆయ‌న‌ వేరే లెవల్‌లో పర్ఫార్మ్ చేశారు. ఈ సూపర్ హిట్ చిత్రంలో నన్ను కూడా భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. RED చూడని వారు తప్పకుండా చూడండి. థ్రిల్ అవుతారు'' అన్నారు. ఈ RED సినిమాలో రామ్ రెండు విభిన్న పాత్రల్లో నటించగా.. ఆయన సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మొదటిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ మూవీ మణిశర్మ సంగీతం ప్లస్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XQmAPS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...