Thursday, 21 January 2021

భార్యతో బీచ్ ఒడ్డున మోహన్ బాబు.. వైరల్ అవుతున్న సీనియర్ హీరో రొమాంటిక్ పిక్

టాలీవుడ్ సీనియర్ హీరో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే ఎక్కువ ఫొటోల్లో తన పిల్లలు మంచు విష్ణు, మనోజ్, లక్ష్మిలతో కనిపించే ఆయన తాజాగా తన భార్య నిర్మలాదేవితో బీచ్ ఒడ్డున పోజివ్వడంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ తల్లిదండ్రులపై ప్రేమను వ్యక్తపర్చింది మంచువారమ్మాయి. షార్ట్ వేసుకొని బీచ్‌లో కూర్చున్న మోహన్ బాబును భార్య నిర్మలా దేవి హగ్ చేసుకున్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తుండటంతో మోహన్ బాబు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ రొమాంటిక్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు లక్ష్మి.. మోహన్ బాబు అల్లుడు ఆండీ శ్రీనివాసన్ ఈ ఫొటో తీసినట్లు పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్స్ ''తొలిసారిగా చూస్తున్న బాబు గారు మరీ ఇంతగా సిగ్గు పడటం, చూడ ముచ్చటైన జంట'' అంటూ ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ఫ్యామిలీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మోహన్ బాబు కెరీర్ విషయానికొస్తే.. చాలా రోజుల త‌ర్వాత హీరోగా మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. '' పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు అందిస్తోన్న ఈ చిత్రానికి స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మోహ‌న్‌బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o8hcT0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...