Wednesday, 27 January 2021

అతన్ని మిస్ అవుతున్నా.. బాధగా ఉందంటూ పెళ్లి చేసుకున్న హీరోపై శ్రద్ధా శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్

గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతూ బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయిన క్రేజీ జోడీ వరుణ్ ధావన్- ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జనవరి 23వ తేదీన ముంబైలోని అలీబాగ్‌లో ఉన్న మాన్సన్ హౌస్ రిసార్ట్‌లో వీరి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు వరుణ్, నటాషా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ పెళ్లిపై స్పందించిన హీరోయిన్ .. ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ పెళ్లితో ఓ మంచి యాక్టర్ కెరీర్ డస్ట్ బిన్‌లో పడినట్లయింది అంటూ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వరుణ్, నటాషా ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన శ్రద్ధ.. ''ఇక అతన్ని వెండితెరపై చూడలేకపోతున్నందుకు బాధగా అనిపిస్తోంది. వేరే హీరోయిన్లతో నటించటానికి ఆ హీరో భార్య, బంధువులు ఒప్పుకోకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ. ఇకపై ఆయన హీరో ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేసుకోవాల్సి వస్తుందేమో!. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కష్టమే. ఏదేమైనా నేనైతే ఆయన్ను మిస్ అవుతున్నా. కంగ్రాట్స్ వరుణ్'' అని కామెంట్స్ చేసింది. దీంతో శ్రద్ద పోస్ట్ చేసిన ఈ కామెంట్స్ జనాల్లో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లయ్యాక హీరోయిన్లకు ఎదురయ్యే పరిస్థితులను కావాలనే ఆమె ఇలా పరోక్షంగా ప్రస్తావించిందని అంటున్నారు నెటిజన్లు. ఎలాగైతేనేం ఈ కన్నడ భామ తనదైన వ్యాఖ్యలతో ఇష్యూని ఇలా వైరల్ చేయడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t0mrrB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...