Wednesday, 27 January 2021

Pushpa: పుష్ప ఐటెం సాంగ్.. చివరకు బాలీవుడ్ బ్యూటీతో డీల్ సెట్! సుకుమార్ పక్కా స్కెచ్..

క్రియేటివ్ డైరెక్టర్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందనేది ప్రత్యేకమైన వివరణ అవసరమే లేదు. ఇక అలాంటి సుక్కుతో అల్లు అర్జున్ తోడైతే ఆ దూకుడును ఆపగలమా? ఐటెం సాంగ్ అంటే ఇలా ఉండాలి.. స్టెప్పేస్తే ప్రేక్షకలోకం హుషారెత్తివాలి అన్నట్లుగా ఉంటుంది ఈ ఇద్దరి తీరు. ఈ నేపథ్యంలోనే తమ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ '' ఐటెం సాంగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి గతంలో ఏ సినిమాలోనూ చుడని విధంగా ఈ ఐటెం సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ఐటెం సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పేసేందుకు ఓ స్పెషల్ లేడీని రంగంలోకి దించాలని స్కెచ్చేసిన సుకుమార్.. బాలీవుడ్ బ్యూటీలు దిశా పటానీ, శ్రద్దా కపూర్, కత్రినా కైఫ్ లాంటి వారిని సంప్రదించారట. అయితే వాళ్ళతో డేట్స్ ఖాళీగా లేకపోవడం, ఒక్క సాంగ్ కోసమే రెమ్మ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడం లాంటి సమస్యలు ఎదురుకావడంతో.. చివరకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ పాట కోసం ఉర్వశికి 80 లక్షల రూపాయల రెమ్మ్యూనరేషన్ ఇస్తున్నారనేది లేటెస్ట్ టాక్. థియేటర్లు హోరెత్తిపోయేలా దేవీ శ్రీ ప్రసాద్ ఈ ఐటెం సాంగ్‌కి బాణీలు కట్టారని, టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఊర్వశి- అల్లు అర్జున్‌లపై ఈ మాస్ బీట్ సాంగ్ షూట్ చేయనున్నారట మేకర్స్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2M7Bdfy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...