Monday, 25 January 2021

‘పుష్ప’ నైజాం రైట్స్‌కు భారీ ధర.. బన్నీ కెరీర్‌లోనే అత్యధికం!

టాలీవుడ్‌లో ఈ ఏడాది రాబోతున్న భారీ చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. స్టైలిష్ స్టార్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో మార్కెట్ కూడా పెరుగుతోంది. అల్లు అర్జున్ గత చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఇప్పుడు ‘పుష్ప’ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఆ డిమాండ్‌తోనే ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులు భారీ ధర పలుకుతున్నాయట. టాలీవుడ్‌కు కీలకమైన నైజాం ఏరియాలో ‘పుష్ప’ డిస్ట్రిబ్యూషన్‌ కోసం నిర్మాతలకు రూ.40 కోట్లు ఆఫర్ చేశారని ప్రస్తుతం ఇండస్ట్రీలో వదంతులు వినిపిస్తున్నాయి. నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన నిర్మాత దిల్ రాజు ఈ భారీ మొత్తాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌కు ఆఫర్ చేశారని అంటున్నారు. ఈ వదంతులే గనుక నిజం అయితే ‘పుష్ప’ సినిమాకు ఈ మొత్తం చాలా ఎక్కువే అని చెప్పాలి. ఇప్పటి వరకు నైజాంలో ‘బాహుబలి 2’, ‘సాహో’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల థియేట్రికల్ రైట్స్‌కు మాత్రమే భారీ ధర పలికింది. వాటి తరవాత ‘పుష్ప’ కూడా చేరిపోతుంది. అంతేకాదు, బన్నీ కెరీర్‌లోనే అత్యధికమవుతుంది. అయితే, ఈ వదంతులను మైత్రీ మూవీ మేకర్స్ లేదంటే దర్శకుడు సుకుమార్ ఖరారు చేయాల్సి ఉంది. కాగా, ‘పుష్ప’ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ ఇది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్ విశేషంగా ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sWV2qk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...