Monday, 25 January 2021

అతన్ని తలచుకుంటే మనసులో బాధగా ఉంటుంది కానీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్ది రోజులపాటు సినిమాలు కూడా పక్కన పెట్టేసి తన ప్రియుడితో చెట్టాపట్టాలేసుకు తిరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఇంగ్లండ్‌కి చెందిన సింగర్ మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఆమె.. అతన్ని ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయడంతో ఆమె పెళ్లి ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే అతనికి బ్రేకప్ చెప్పేసి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది . రవితేజ సరసన నటించిన శృతి హాసన్ ఇటీవలే 'క్రాక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టడంతో శృతి ఖాతాలో విజయం పడింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా ఓ నెటిజెన్ మీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి నిజమేనా? అని ప్రశ్నించడంతో అదంతా ఫేక్ అని, ఈ ఏడాది తాను పెళ్లి చేసుకోబోవడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇక మరో నెటిజన్ మైకేల్‌తో శృతి ప్రేమాయణం తాలూకు విషయాలను తవ్వుతూ.. మీకు మైకేల్‌ గుర్తుకు వచ్చినప్పుడు అసహ్యం వేస్తుందా? అని ప్రశ్నించాడు. దీనిపై ఏ మాత్రం తడబడకుండా రియాక్ట్ అయిన శృతి హాసన్.. తనకు ఏ ఒక్కరిపై ద్వేషం ఉండదని, తనది అలాంటి తత్త్వం కాదని పేర్కొంటూ చాలా చాకచక్యంగా సమాధానమిచ్చింది. కాకపోతే అతన్ని తలచుకుంటే లోలోపల బాధగా ఉంటుందని ఆమె చెప్పడం విశేషం. సో.. ఎలాగూ ఈ ఏడాది పెళ్లి చేసుకోనంటోంది కాబట్టి చూడాలి మరి శృతి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MhvJi2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...