Tuesday, 12 January 2021

‘బంగారు బుల్లోడు’ వచ్చేస్తున్నాడు.. డేట్ ఫిక్స్ చేసిన అల్లరోడు

అల్లరి న‌రేష్ హీరోగా పి.గిరి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బంగారు బుల్లోడు’. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్రహ్మం నిర్మిస్తున్నారు. అల్లరి న‌రేష్ స‌ర‌స‌న నాయిక‌గా పూజా ఝ‌వేరి న‌టించిన‌ ఈ చిత్రానికి సంబంధించి అన్ని ప్రొడ‌క్షన్‌, పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు పూర్తయ్యాయి. ప్రేక్షకుల‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ జ‌న‌వ‌రి 23న‌ ‘బంగారు బుల్లోడు’ను విడుద‌ల చేస్తున్నట్లు లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం ప్రక‌టించింది. హీరోయిన్ పూజా ఝ‌వేరి స్కూట‌ర్‌పై వెళ్తుంటే, వెనుక హీరో న‌రేష్ త‌న బృందంతో హుషారుగా పాట పాడుతూ ఆమె వెంట ప‌డుతున్నట్లు ఆ పోస్టర్‌లో క‌నిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలో పాట‌ల‌న్నింటినీ రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు. అల్లరి న‌రేష్ కెరీర్‌లో ఓ చ‌క్కని హాస్యభ‌రిత చిత్రంగా ‘బంగారు బుల్లోడు’ నిలుస్తుందని నిర్మాత‌లు తెలిపారు. టాలీవుడ్‌లోని ప‌లువురు పేరుపొందిన హాస్యన‌టులు ఈ చిత్రంలో న‌టించార‌ని, వారిపై చిత్రీక‌రించిన ప‌లు స‌న్నివేశాలు ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్వుకునేలా చేస్తాయ‌ని వారు చెప్పారు. స‌తీష్ ముత్యాల సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎం.ఆర్‌. వ‌ర్మ ఎడిట‌ర్‌గా ప‌నిచేసిన ఈ చిత్రానికి కృష్ణకిశోర్ గ‌రిక‌పాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, అజ‌య్ సుంక‌ర స‌హ నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ఇంకా త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణముర‌ళి, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేష్‌, ప్రభాస్ శ్రీ‌ను, జ‌బ‌ర్దస్త్ మ‌హేష్‌, అనంత్‌, భ‌ద్రం, అజ‌య్ ఘోష్‌, సారిక రామ‌చంద్రరావు, రామ‌ప‌త్ర నిత్ర వెలిగొండ శ్రీ‌నివాస్‌ ముఖ్య పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nE2V09
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...