Sunday, 10 January 2021

మా జీవితాల్లో మీలాంటి వ్యక్తి ఉండటం అదృష్టం: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తన తండ్రిని ఎంతగా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని బడా నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ వారసుడిగా అడుగుపెట్టిన అల్లు అరవింద్ తనకు అవకాశం దొరికినప్పుడల్లా తండ్రిపై ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. గతేడాది ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన తండ్రికి థాంక్స్ చెబుతూ కంటతడి కూడా పెట్టుకున్నారు. వేదికపై తండ్రీకొడుకుల ఎమోషనల్ సీన్ అందరినీ కట్టిపడేసింది. కాగా, ఇప్పుడు మరోసారి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. నేడు అల్లు అరవింద్ పుట్టినరోజు. ఆయన 72వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బన్నీ. ‘‘ఇలాంటి రోజులు మీరు మరిన్ని జరుపుకోవాలి నాన్న. నీకు తెలిసిన ప్రతి ఒక్కరి కోసం ప్రతి విషయంలో సహాయంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మా జీవితాల్లో నీలాంటి ఒక వ్యక్తి ఉండటం చాలా అదృష్టం. ఈ పుట్టినరోజు మిమ్మల్ని మరింత యువకుడిలా మార్చాలి’’ అని బన్నీ పేర్కొన్నారు. బన్నీ తరవాత ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘గాడ్‌ఫాదర్’ నవలలోని కల్పిత పాత్ర అయిన డాన్ కార్లియోనీతో తన తండ్రిని పోల్చారు శిరీష్. పబ్లిక్‌లో తన తండ్రి గురించి బోలెడన్ని మాటలు చెప్పడానికి తాను వేచి చూస్తున్నానని పేర్కొన్నారు. వీరితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38tLLxN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...