Sunday, 10 January 2021

‘క్రాక్’ భూమ్ బద్దల్ ఓపెనింగ్స్.. బాక్సాఫీసు దుమ్ము దులుపుతోన్న మాస్ రాజా

ఆర్థిక సమస్యలతో జనవరి 9న ఆలస్యంగా విడుదలైన ‘క్రాక్’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అంటూ విమర్శకులు సైతం ‘క్రాక్’పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా 9 నెలలు థియేటర్లకు దూరమైన ప్రేక్షకులు ఒక మంచి మాస్ సినిమా కోసం వేచిచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి ‘క్రాక్’ ఒక విందు భోజనంలా దొరికింది. మాస్ ఆడియన్స్‌కు కావాల్సినవన్నీ ఇచ్చేశారు రవితేజ. దీంతో సినిమాను ఎగబడి చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఈవినింగ్ షోలతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ‘క్రాక్’కు భూమ్ బద్దల్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పోస్టర్ కూడా విడుదల చేసింది. అయితే, కలెక్షన్ ఎంత అనే విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ, ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.5 కోట్ల షేర్ వసూలైందని అంటున్నారు. పక్కా లెక్కలు తెలియాల్సి ఉంది. ఇక యూఎస్‌లో కూడా ‘క్రాక్’ మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రీమియర్లు రద్దయినప్పటికీ తొలిరోజు 31 లొకేషన్స్‌లో 34,500 డాలర్ల గ్రాస్‌ను ‘క్రాక్’ వసూలు చేసిందని సమాచారం. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇంచుమించుగా రూ. 25,31,554. కాగా, ‘క్రాక్’ థియేట్రికల్ రైట్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్లకు విక్రయించినట్టు టాక్. మొత్తం మీద లాంగ్ గ్యాప్ తరవాత వచ్చిన మాస్ మహారాజా బాక్సాఫీసు దుమ్ము దులుపుతున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XuLq7X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...