Thursday, 21 January 2021

ఆ ఇద్దరి రుణం తీర్చుకోలేనిది: ఆలీ

ప్రముఖ హాస్యన‌టుడు డాక్టర్ ఆలీ నిర్మాత‌గా మారారు. ఆలీవుడ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకాంపై ఆలీ నిర్మాతగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి’. కొణతాల మోహనకుమార్ సహ నిర్మాత. ఆలీ, వీకే న‌రేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవ‌లే అంగ‌రంగ వైభవంగ మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి, సీనియర్ ద‌ర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి న‌టిస్తుండ‌టం విశేషం. ఇప్పటివ‌రుకు తెర‌వెనుక‌నే ఉంటూ ఎన్నో బ్లాక్ బ‌స్టర్ చిత్రాల్ని తెలుగు చిత్రసీమ‌కు అందించిన ఈ దిగ్గజ‌ ద్వయం తొలిసారిగా కలిసి వెండితెర మీద‌కు రాబోతున్నారు. గ‌తంలో ఎస్‌వీ కృష్ణారెడ్డి హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్పటికీ.. అచ్చిరెడ్డితో క‌లిసి న‌టించ‌డం ఇదే మొద‌టిసారి. ఆలీని హీరోగా పరిచయం చేసి.. ఆయ‌న కెరీర్‌ని ఓ కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి, ఇప్పుడు ఆలీ కోరిక మేర‌కు సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించారు. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న ఆలీ.. ‘‘న‌న్ను హీరోగా పరిచయం చేసి నా కెరీర్‌ని కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గార్లకు మ‌ళ్లీ నేను నిర్మాతగా మారి తెర‌కెక్కిస్తున్న ‘అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి’లో అవ‌కాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వారిద్దరి పాత్ర చిన్నదైన‌ప్పటికీ నా మీద అభిమానంతో న‌టించ‌డానికి అంగీక‌రించారు’’ అని వెల్లడించారు. తాజాగా జ‌రిగిన షెడ్యూల్‌లో అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి మీద కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్ర ద‌ర్శకుడు శ్రీపురం కిర‌ణ్ చిత్రీక‌రించినట్టు ఆలీ తెలిపారు. మ‌లయాళీ బ్లాక్ బ‌స్టర్ ‘వికృతి’కి రీమేక్ సినిమాగా ‘అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి’ రాబోతుంది. ఈ సినిమాలో యువ న‌టి మౌర్యానీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే, పవిత్రా లోకేశ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రాకేశ్ పళిడమ్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఎస్.మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాస్తున్నారు. సెల్వకుమార్ ఎడిటర్. రచన, దర్శకత్వం శ్రీపురం కిరణ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p6b8f0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...