ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు వ్యాపార ప్రకటనలతో బిజీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. సినిమాల్లో రొమాంటిక్ సీన్స్‌లో నటించడం, రియల్ లైఫ్‌లో తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో ఉండే క్లోజ్‌నెస్ తదితర విషయాలపై ఓపెన్ అయింది దీపికా. 'ఐశ్వర్య' అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా కెమెరా ముందుకొచ్చిన దీపికా.. 'ఓం శాంతి ఓం' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. ఆ తర్వాత టీమిండియా క్రికెటర్స్ మహేంద్ర సింగ్ ధోనీతో, యువరాజ్ సింగ్‌తో ఆమె ప్రేమాయణం.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్ లాంటి వార్తలతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ చివరకు 2018 సంవత్సరంలో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడింది. అప్పటి నుంచి ఈ క్రేజీ జోడీకి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. Also Read: పెళ్లి తర్వాత కూడా దీపిక, ఇద్దరూ తమ తమ కెరీర్ కొనసాగిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కపిల్ దేవ్ బయోపిక్ ‘83'లో భార్యాభర్తలుగా నటిస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో భర్త రణ్‌వీర్ సింగ్‌తో తన రిలేషన్ విషయమై దీపిక కొన్ని కామెంట్స్ చేసింది. తన ప్రతి ప్రాజెక్టు గురించి భర్త రణ్‌వీర్ సింగ్‌తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని, సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ విషయమై కూడా ఆయనతో చర్చించాకే డిసైడ్ అవుతానని చెప్పుకొచ్చింది. అలాగే రణ్‌వీర్ కూడా ఆయన సినిమాల విషయమై తనతో చర్చిస్తుంటారని దీపిక తెలిపింది. ఇవన్నీ కేవలం మా కెరీర్‌లో భాగం మాత్రమే అంటూ ఈ పర్సనల్ మ్యాటర్స్ బయటపెట్టింది దీపిక. ఇకపోతే తెలుగు తెరపై కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైన దీపిక పదుకొనే.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ మూవీలో ఛాన్స్ పట్టేసింది. ప్రభాస్ కెరీర్‌లో 21వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39Qe7Sy
v
No comments:
Post a Comment