Friday, 1 January 2021

Akshara: నందితా శ్వేత లీడ్ రోల్‌లో 'అక్షర'.. ఫిబ్రవరిలో రిలీజ్

లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘’. సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అయింది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ''న్యూ ఈయర్ సందర్భంగా మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు హీరో అడివి శేష్‌కు ముందుగా థాంక్స్. సోషల్ మెసేజ్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్‌గా మా ‘అక్షర’ మూవీ రూపొందింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం. ఇప్పుడు పరిస్థితులన్ని చక్కబడ్డాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నాం. ఎంటర్‌టైన్మెంట్ ఎక్కడా మిస్ అవకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నాం'' అన్నారు. నందితా శ్వేత టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o0MhJ4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...