Friday, 1 January 2021

నాగశౌర్య ‘ల‌క్ష్య’ చివ‌రి షెడ్యూల్‌.. ముహూర్తం ఖరారు

హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ ఈ నెల 4 నుండి ప్రారంభంకానుంది. కాగా, నూత‌న సంవ‌త్సర శుభాకాంక్షల‌తో స‌రికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. నాగ‌శౌర్య కుడి చేతికి క‌ట్టు క‌ట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుద‌ల‌ చేసిన స్టన్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. ‘ది గేమ్ విల్ నెవ‌ర్ బీ ద సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్‌లో ఉన్న నాగ‌శౌర్య లుక్‌కు ప్రశంసలు అందాయి. ఇప్పటి వరకు చూడని లుక్‌తో, సబ్జెక్ట్‌తో వస్తోన్న నాగశౌర్య తెలుగు ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తారో చూడాలి. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KQMgZW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...