సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై , జంటగా రూపొందుతున్న సినిమా ''. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. కరోనా కారణంగా కొన్ని నెలలు విరామం తీసుకొని తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 26వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నామని ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. 'గివ్ మీ సమ్ లవ్' అనే ఆసక్తికర ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ రంగ్ దే మూవీ నితిన్ కెరీర్‌లో 29వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pGhsK4
v
No comments:
Post a Comment