Tuesday, 22 December 2020

Samantha: మీరు చాలా రొమాంటిక్ టైప్ అనుకున్నారేమో..! చిరంజీవిపై సమంత పంచ్.. వీడియో వైరల్

పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్‌గా భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న .. నాగచైతన్యతో పెళ్లి తర్వాత తన ఫాలోయింగ్‌కి అక్కినేని అభిమానులను యాడ్ చేసుకుంది. విలక్షణ కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా దూసుకుపోతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలోనే 'ఆహా' ఓటీటీ వేదికపై 'నాతో ఎంజాయ్‌మెంట్ మాములుగా ఉండదు' అంటూ సామ్ జామ్ ప్రోగ్రాం హోస్ట్ చేస్తోంది. ఈ ప్రోగ్రాం ద్వారా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, వారి వారి సినిమా సంగతులపై ఫోకస్ పెడుతూ ఆడియన్స్‌కి కిక్కిస్తోంది సమంత. ఇప్పటికే ఆహా వేదికపై విజయ్ దేవరకొండ, రానా, తమన్నా, అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లాంటి స్టార్స్‌ని ఇంటర్వ్యూ చేసిన సమంత.. ఈ సారి మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది. క్రిస్మస్ కానుకగా ఆహా వేదికపై డిసెంబర్ 25న ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వరుస ప్రోమోలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో షో పట్ల ఆతృత పెంచేస్తున్నారు. సమంత- టాక్ షోకి సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజ్ చేయగా తాజాగా మరో ప్రోమో బయటకొచ్చింది. ఇందులో చిరంజీవిని ఇరుకున పెట్టేస్తూ సమంత మాట్లాడిన తీరు, వేసిన పంచులు హైలైట్ అవుతున్నాయి. ‘మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చేశారా’ అంటూ సమంత ప్రశ్నించగా, ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని చిరంజీవి అన్నారు. అయితే ఆ తర్వాత కిందకు వంగి కళ్లు తుడుచుకుంటుండగా లైట్స్‌ వేశారని, తాను పైకి లేచేసరికి పైట తన చేతిలో ఉందని నవ్వుతూ చిరంజీవి చెప్పడంతో.. వెంటనే అందుకున్న సమంత 'మీరు చాలా రొమాంటిక్ అనుకున్నారేమో..!' అంటూ పంచ్ విసిరింది. దీంతో మెగాస్టార్ ఆశ్చర్యపోయారు. చేతులు లేని ఓ బాలుడు వేదికపైనే నోటితో చిరు పెయింట్‌ వేయడం, దానికి చిరు అమితమైన ఆనందం వ్యక్తం చేయడం మరో హైలైట్ సన్నివేశం. ఇక చిరంజీవి దోష ఛాలెంజ్‌ని మరోసారి రిపీట్ చేసింది సామ్. దోష వేసి గరిటె తిప్పాల్సిందిగా సమంత కోరగా.. మామూలుగా ఎవరైనా తిప్పుతారు, కళ్ళకు గంతలు కట్టుకొని తిప్పుతా అంటూ చిరంజీవి దోష వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mBOPvD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...