Tuesday, 22 December 2020

షాకింగ్: రకుల్ ప్రీత్ సింగ్‌‌కి కరోనా పాజిటివ్.. మంచు లక్ష్మి ఫన్నీ రియాక్షన్

మెల్లగా కరోనా బారినుంచి బయటపడుతున్నాం అనుకుంటుండగానే ఏదో ఒక వార్త బయటకొచ్చి జనాన్ని కంగారులో పడేస్తోంది. ఎంతో పకడ్బందీగా లాక్‌డౌన్ విధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశలవారీగా సడలింపులు ఇవ్వడంతో ప్రజల దైనందిన జీవితం తిరిగి యదా స్థానానికి చేరుకుంది. సినిమా షూటింగ్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెన్ చేయడంతో జనం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు కరోనా సోకిందని పేర్కొంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాను కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చిందని, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని, ఆరోగ్యం కూడా బాగానే ఉందని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది రకుల్. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరింది. వైరస్ నుంచి కోలుకొని త్వరలో షూటింగ్‌లో జాయిన్ అవుతానని ధీమా వ్యక్తం చేసింది రకుల్. అయితే ఈ ట్వీట్ చూసిన .. తాను కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని, మోస్ట్ నెగటివ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ నేనే అంటూ ఫన్నీ రియాక్షన్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది . ఇటీవలే మరో తెలుగు చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్న ఆమె ఏకంగా మూడు హిందీ సినిమాలకు కమిటై ఉండి. ఇవిగాక రెండు తమిళ సినిమాలు కూడా ఓకే చేసింది. అలాగే కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్‌ 2 లోనూ ఆమె నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nHq5Uh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...