Tuesday, 22 December 2020

బిగ్ బాస్ టైటిల్ గెలిచే సత్తా ఆమెలో ఉంది.. కానీ తప్పుగా చూపిస్తున్నారు: రాఖీ సావంత్ భర్త ఓపెన్ కామెంట్స్

బోల్డ్ బ్యూటీగా, కాంట్రవర్సీ క్వీన్‌గా పేరుతెచ్చుకున్న హిందీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పెళ్లికి ముందే ఎంతోమందితో రిలేషన్‌లో ఉంటూ లవ్ ఎఫైర్లు నడిపించిన ఆమె గతేడాది యూకేకు చెందిన రితేష్ అనే బిజినెస్‌మెన్‌ని పెళ్లి చేసుకుని స్థిరపడింది. చాలాకాలం పాటు తన భర్త ఎవరన్నది కూడా సస్పెన్సులోనే ఉంచింది. ఆ తర్వాత రితేష్ స్వయంగా తమ పెళ్లి మ్యాటర్ బయటపెట్టాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాఖీ సావంత్ బిగ్ బాస్ 14 లోకి వెళ్ళాక మరోసారి ఆమె భర్త చేసిన కామెంట్స్ జనాల్లో హాట్ ఇష్యూగా మారాయి. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పిన రితేష్.. పరిచయం మొదలైన కొద్దిరోజుల వ్యవధిలోనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. తమ ఇద్దరి లవ్ స్టోరీ సినిమాగా తీస్తే మరే ఇతర సినిమాలు సరితూగవని ఆయన అన్నాడు. రాఖీ చాలా మంచి అమ్మాయని, ఆమె తనకు భార్యగా దొరకడం అదృష్టమని చెప్పాడు. అనంతరం రాఖీ బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడిన ఆయన ఈ షోలో తన భార్యను తప్పుగా చూపిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హౌస్‌లో ఉన్న నిక్కీ తంబోలీ, మను పంజాబీ రాఖీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తనకు బాధగా అనిపించిందని రితేష్ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ షోలో రాఖీ సావంత్ మంచితనాన్ని చూపించకుండా దాచిపెడుతున్నారని అన్నాడు. అందువల్లనే ఆమెపై ట్రోల్స్ నడుస్తున్నాయని అన్నాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచే సత్తా ఆమెలో ఉందని చెప్పిన ఆయన.. తాను కూడా హౌస్ లోకి వెళ్లి కెమెరాల ముందు నిల్చోవడానికి సిద్దమే అని చెప్పడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rj4PGz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...