Sunday, 13 December 2020

RRR అప్‌డేట్: ఎన్టీఆర్‌ను వృద్ధుడిగా మారుస్తున్న రాజమౌళి.. హెవీ మేకప్!

ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే భారీతనం ఉంటుంది. తను అనుకున్న ఔట్‌పుట్ కోసం రాజమౌళి ఎంత దూరమైనా వెళ్తారు. నటీనటుల నుంచి తనకు కావాల్సినదాన్ని రాబట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నుంచి కూడా ఇలాగే రాబడుతున్నారట జక్కన్న. ఎన్టీఆర్‌ను కొమురం భీమ్‌గా, రామ్ చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా చిత్రీకరిస్తూ ఒక కల్పిత కథతో రాజమౌళి చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ . ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ స్థాయికి తగ్గట్టే రాజమౌళి అండ్ టీం ప్రస్తుతం శ్రమిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే బోలెడన్ని వదంతులు వచ్చాయి. తాజాగా మరో రూమర్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ వృద్ధుడిలా కనిపించబోతున్నారని టాక్. దీని కోసం ప్రొతెస్టిక్ మేకప్ వేస్తున్నారట. ఎన్టీఆర్‌ను ముసలి వ్యక్తిలా చూపించడానికి భారీగా ప్రొతెస్టిక్ మేకప్ అవసరం పడుతోందని అంటున్నారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని.. సినిమాకు ఇదో ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ ఎన్టీఆర్‌ తొలిసారి ప్రొతెస్టిక్ మేకప్ వేసుకుంటున్నారు అనే అంశం ఆసక్తి రేపుతోంది. Also Read: ఇదిలా ఉంటే, RRRలో కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. సుమారు 50 రోజులపాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో పోరాట సన్నివేశాలతో పాటు మరికొన్ని సీన్స్ షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ పాల్గొన్నారు. ఆ తరవాత తాజాగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో చిన్న షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం పుణే సమీపంలో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఇంకా అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oKTpt6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...