Sunday, 13 December 2020

నేను మగాడిని అయితే ఆమెను ప్రేమిస్తా.. చాలా సెక్సీగా ఉంటుంది: శృతిహాసన్

దక్షిణాది సినీ పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ సరసన ఇప్పటికే శృతి నటించారు. ప్రస్తుతం రవితేజతో రెండో సారి ‘క్రాక్’లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇప్పుడు ‘వకీల్ సాబ్’లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే, టాలీవుడ్‌లో తనకు ప్రభాస్‌ సరసన నటించాలని ఉందని శృతిహాసన్ చెప్పారు. తెలుగులో తాను జత కట్టని స్టార్ హీరో ప్రభాస్ ఒక్కరే అని ఆమె అన్నారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. రాపిడ్ ఫైర్‌లో భాగంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు అంతే ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ‘మీ ఊతపదం ఏంటి?’ అన్న ప్రశ్నకు ‘అయ్యో!’ అని శృతి సమాధానం ఇచ్చారు. ‘ఫేవరేట్ హ్యాంగౌట్ ప్లేస్ ఏంటి?’ అన్న ప్రశ్నకు తన ఇల్లు అని చెప్పారు. ఇష్టమైన రెస్టారెంట్ ఏది అంటే.. లండన్‌లోని బోన్ డాడీస్ అని వెల్లడించారు. Also Read: ఇక మీ శరీరంలో బ్యూటీ స్పాట్ ఏది అన్న ప్రశ్నకు తన జుట్టు అని అన్నారు. బల్లులు, పాములు అంటే తనకు చచ్చేంత భయమని చెప్పారు. ప్రస్తుతానికి తాను సింగిల్ అని, ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని తెలిపారు. ఎలాంటి అబ్బాయిలు అంటే మీకు ఇష్టం అని అడిగిన ప్రశ్నకు.. ‘‘గెడ్డంతో ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టం’’ అని చెప్పారు. ఒకవేళ మీరు అబ్బాయి అయి ఉంటే మీరు ఎవరితో జతకట్టేవారు? అని అడిగితే.. ‘‘తమన్నా అంటే చాలా ఇష్టం. ఆమె చాలా అందంగా, సెక్సీగా ఉంటుంది’’ అని శృతి సమాధానం ఇచ్చారు. ఇక జీవితంలో తనకు స్ఫూర్తి తన తండ్రి కమల్ హాసన్ అని శృతిహాసన్ చెప్పారు. అలాగే, తన స్నేహితులు కూడా తనను చాలా ఇన్‌స్పైర్ చేశారని అన్నారు. ఇక ఫిట్‌నెస్ విషయంలో ఎవరు స్ఫూర్తి అని అడిగిన ప్రశ్నకు.. హాలీవుడ్ బ్లాక్ బ్యూటీ హాలీ బెర్రీ పేరు చెప్పారు. జేమ్స్ బాండ్ చిత్రం ‘డై అనదర్ డే’లో పీయర్స్ బ్రోస్నన్ సరసన బాండ్ గర్ల్‌గా హాలీ బెర్రీ నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gHTsD0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...