Sunday, 13 December 2020

రెజీనాను ‘ఇడియట్’ అన్న సందీప్ కిషన్.. వెల్‌కమ్ టు ద క్లబ్ అంటూ వెటకారం

టాలీవుడ్‌లో మంచి స్నేహితులుగా ఉన్న హీరోహీరోయిన్లలో , జంట ఒకటి. 2012లో వచ్చిన ‘రొటీన్ లవ్‌స్టోరీ’లో తొలిసారి కలిసి నటించిన సందీప్ కిషన్, రెజీనా.. ఆ తరవాత ‘రారా.. కృష్ణయ్య’, ‘నక్షత్రం’ చిత్రాల్లో జంటగా కనిపించారు. ఆన్‌స్క్రీన్ మీద రొమాన్స్ చేసిన ఈ ఇద్దరూ.. ఆఫ్‌స్క్రీన్‌లో మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి అవార్డ్ ఫంక్షన్స్‌ను కూడా హోస్ట్ చేశారు. వీళ్లిద్దరి మధ్య మంచి చనువు ఉంది. ఇదిలా ఉంటే, నేడు రెజీనా పుట్టినరోజు. నేటితో ఆమె 30వ ఏట అడుగుపెట్టారు. రెజీనా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు హీరో సందీప్ కిషన్. ‘‘హ్యాపీ బర్త్‌డే ఇడియట్... వెల్‌కమ్ టు ద క్లబ్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆనందంగా ఉండు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. దయచేసి కాల్స్ ఆన్‌ టైమ్‌లో అటెండ్ చేయి’’ అని సందీప్ కిషన్ పేర్కొన్నారు. ఇక్కడ ‘‘వెల్‌కమ్ టు క్లబ్’’ అని సందీప్ కిషన్ అన్నది 30 ఇయర్స్ క్లబ్ గురించి. రెజీనా 30 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇలా వెటకారం చేశారు సందీప్. Also Read: దీనికి రెజీనా రిప్లై కూడా అదిరింది. ‘‘నా కన్నా ముందు నువ్వు ఆ క్లబ్‌లోకి అడుగుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. కృతజ్ఞతలు తాత’’ అని పేర్కొన్నారు. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. సందీప్ కిషన్ ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించారు. హిప్‌హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నారు. కవిన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి టి.జి.విశ్వప్రసాద్, సందీప్ కిషన్ నిర్మాతలు. మరోవైపు రెజీనా చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. ఆమె చివరి తెలుగు సినిమా ‘ఎవరు’.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/343TfVR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...