Sunday, 6 December 2020

RRR: ఆలియా భట్ వచ్చేసింది.. జక్కన్న టీమ్‌లో కొత్త జోష్

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఎట్టకేలకు RRR టీంతో జాయిన్ అయ్యారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా భట్ ఒక హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. నవంబర్‌లోనే ఆలియా షూటింగ్‌లో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే, తాను RRR షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు ఆలియా ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేశారు. రేపటి నుంచి ఆలియా RRR షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా సుమారు ఏడు నెలలపాటు ఆగిపోయిన విషయం తెలిసిందే. సుధీర్ఘ విరామం తరవాత అక్టోబర్ 5 నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్‌లో 50 రోజుల షెడ్యూల్ అనంతరం RRR టీం మహారాష్ట్రకు బయలుదేరింది. పుణే, మహాబలేశ్వరంలో షూటింగ్ చేయడానికి వెళ్లింది. ఇప్పటికే మహాబలేశ్వరంలో చిన్న షెడ్యూల్‌ను RRR టీం పూర్తిచేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. Also Read: కాగా, RRR ద్వారా ఆలియా భట్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. రామ్ చరణ్‌కు జంటగా ఆలియా భట్ నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆలియా భట్ సీతగా కనిపించనున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. శ్రియా శరణ్, అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37zY760
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...