Sunday, 6 December 2020

దుబాయ్‌లో కొత్త సినిమా షూటింగ్ షురూ చేసిన నితిన్

హీరోగా మేర్లపాక గాంధీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న చిత్రం షూటింగ్ ఆదివారం దుబాయ్‌లో మొద‌లైంది. హీరో హీరోయిన్లు నితిన్‌, న‌భా న‌టేష్‌పై దుబాయ్‌లో స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఫిల్మ్ షూటింగ్ మొద‌లైన విష‌యాన్ని త‌న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియ‌జేసిన నితిన్‌.. సెట్స్ మీద నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశారు. ఇది నితిన్‌కు 30వ సినిమా. Also Read: నితిన్ షేర్ చేసిన ఫొటోలో ఆయ‌న‌ ష‌ర్టుపై స్వెట‌ర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ క‌నిపిస్తున్నారు. ఈ మూవీలో త‌మ‌న్నా భాటియా ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి జ‌రిగే త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొన‌నున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. త్వర‌లోనే ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న మిగ‌తా తారాగ‌ణం, టెక్నీషియ‌న్ల వివ‌రాల‌ను వెల్లడించ‌నున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’ షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దుబాయ్‌లో జరుగుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IikTqm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...