Tuesday, 8 December 2020

Roja: భయమంటే ఏంటో చూపిస్తామంటూ రోజాకు బెదిరింపులు.. తొడగొట్టి సవాల్ విసిరిన అనసూయ.. ఇష్యూ వైరల్

ఇటు జబర్దస్త్ జడ్జ్‌గా బుల్లితెరపై అటు నగరి ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రోజాకు అనూహ్యంగా బెదిరింపులు ఎదురయ్యాయి. భయమంటే ఏంటో చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబాభాస్కర్‌. దీంతో వెంటనే రంగంలోకి దిగిన తొడగొట్టి సవాల్ విసిరింది. చూసుకుందాం.. మీ ప్రతాపమో మా ప్రతాపమో అంటూ ఛాలెంజ్ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏంటి.. అర్థం కాలేదా? అదేనండీ ప్రతి స్పెషల్ డేకి ఓ స్పెషల్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ బుల్లితెర ఆడియన్స్‌‌ని ఉర్రూతలూగించే ఈటీవీ బృందం ఈ సారి తమలో తామే పోటీ పెట్టుకుంది. ఈ డిసెంబర్ 31 నాడు జబర్దస్త్, ఢీ పోటాపోటీగా రంగంలోకి దిగబోతున్నాయట. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వీడియో రిలీజ్ చేసి జనాల్లో ఆసక్తి రేకెత్తించారు. ఈ వీడియోలో , బాబా భాస్కర్, తాగుబోతు రమేష్, అనసూయ, హైపర్ ఆది ఎవరికి వారు తమ తమ పదునైన డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. 2021 స్వాగత వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న ఈ టీవీలో ‘డీజే 2021’ పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌ ప్రసారం కానుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరగనున్న ఈ వేడుకలను ‘ఢీ’ స్టేజ్‌పై చేయాలని భావించింది జబర్ధస్త్ టీమ్. ఈ మేరకు 'ఢీ' సెట్‌లోకి వెళ్లి ఆ స్టేజ్ కావాలని అడిగింది. దానికి శేఖర్ మాస్టర్ నో చెప్పడంతో ‘ఢీ’లో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరినీ కిడ్నాప్ చేసి ఓ చోట బంధించామని, స్టేజ్ ఇవ్వకుంటే వారిని విడిచిపెట్టేదే లేదని జబర్ధస్త్ కమెడియన్లు బెదిరించారు. దీంతో ‘ఢీ’ టీమ్‌కు సపోర్ట్‌గా బాబాభాస్కర్ రంగంలోకి దిగారు. Also Read: జబర్దస్త్ యూనిట్‌పై బెదిరింపులకు దిగుతూ రోజా టీమ్‌కు ఓ వీడియో పంపారు బాబాభాస్కర్. శేఖర్‌ మాస్టర్ అమాయకుడు కదా అని 'ఢీ' స్టేజ్‌పైకి వచ్చిమరీ వార్నింగ్‌ ఇచ్చి వెళ్తున్నారా. మీరు వేస్ట్‌ రా. మా వాళ్లని వదిలేయండి లేదంటే డిసెంబర్‌ 31 రాత్రి అసలు భయమేంటో చూపిస్తాం అంటూ కత్తి పట్టుకొని గట్టిగానే బెదిరించారు. దీనిపై రియాక్ట్ అయిన రోజా రెడీ అనేసింది. దీంతో వెంటనే తొడగొట్టి సవాల్ విసురుతూ అనసూయ రెచ్చిపోయింది. ఇక చివరగా బ్రహ్మానందం అమాయకంగా చెప్పిన మాటలు ఈ ప్రోమో వీడియోలో కొసమెరుపు. ఇదంతా చూస్తుంటే డిసెంబర్‌ 31 రాత్రి రచ్చ రచ్చే అని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36VWBfh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...