ప్రస్తుతం ఎక్కడచూసినా కొణిదెల నాగబాబు కుమార్తె, మెగా డాటర్ గురించిన చర్చలే నడుస్తున్నాయి. పెళ్లికి వారం ముందు నుంచే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన మెగా ఫ్యామిలీ ప్రస్తుతం రాజస్థాన్ చేరుకొని అక్కడి ఉదయ్‌పూర్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి మెగా ఫ్యామిలీతో పాటు కేవలం కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరికి ఆహ్వానాలు అందాయననేది జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు యంగ్ హీరోయిన్స్ ఫ్లైట్ ఎక్కేసి నిహారిక పెళ్లి వేడుకకు బయల్దేరారు. ఆ ఇద్దరే.. లావణ్య త్రిపాఠి, వీళ్ళిద్దరూ నిహారిక జిమ్‌మేట్స్ పైగా మెగా డాటర్‌కి బాగా క్లోజ్ కావడంతో ప్రత్యేకంగా వీళ్ళను ఆహ్వానించిందట మెగా డాటర్. టాలీవుడ్ హీరోయిన్లలో ఈ ఇద్దరు మాత్రమే నిహారిక పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే నాగబాబు అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు రాబోతున్నారట. Also Read: రేపు (డిసెంబర్ 9) రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చైతన్యతో నిహారిక పెళ్లి జరగనుంది. ఈ మెగా వేడుకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖులు సందడి చేయనున్నారు. ఆ తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులందరి కోసం హైదరాబాద్‌లో స్పెషల్ పార్టీ అరేంజ్ చేసింది మెగా ఫ్యామిలీ. ఈ పార్టీలో టాలీవుడ్ నటీనటులంతా పాల్గొననున్నారట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36VvrVV
v
No comments:
Post a Comment