Tuesday, 8 December 2020

కమిట్‌మెంట్ మస్ట్ అంటున్న స్టార్ హీరో కూతురు.. బికినీ వేసి ఓపెన్ అయ్యిందిలా!!

రీసెంట్‌గా తన మానసిక సమస్యలు, తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను బయటపెడుతూ సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన బికినీ లుక్ పోస్ట్ చేస్తూ ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం తాను లోనావాలాలో రిలాక్స్ అవుతున్నానని పేర్కొంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ స్టార్ డాటర్.. వ‌ర్క్‌లో జాయిన్ అయ్యే ముందు కాస్త రిలాక్స్ అవుతోందట. ఈ మేరకు లోనావాలా హిల్స్ చేరుకున్న ఆమె ఓ వారం పాటు అక్కడే ఎంజాయ్ చేయనుందని తెలిసింది. రిలాక్సేష‌న్ కోసం బాత్ ట‌బ్‌లో ప‌డుకొని పుస్త‌కం చ‌దువుతున్న ఫొటోను, అలాగే బికినీ వేసి స్విమ్మింగ్ పూల్‌లో సర‌దాగా గ‌డిపిన స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఐరా ఖాన్. ''నేనింకా చాలా చేయాలి. సోష‌ల్ మీడియా క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల కొన్నిసార్లు టైమ్ ఉండదు. కానీ.. దాంతోపాటు కొన్నిసార్లు సరైన విరామం కూడా అవ‌స‌రం. మొద‌ట నీకోసం నువ్వు నీ క‌మిట్‌మెంట్స్ పూర్తి చేసుకో. విరామం త‌ర్వాత మ‌ళ్లీ ప‌నిలో చేరబోతున్నా.. మీరంతా వెయిట్ చేస్తున్నందుకు ధ‌న్వ‌వాదాలు'' అంటూ ఐరా ఖాన్ తన సందేశం పోస్ట్ చేసింది. Also Read: ఇదిలాఉంటే.. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో బ్రేకప్ చేసుకున్న ఐరాఖాన్ ప్రస్తుతం ఆమిర్‌ఖాన్ జిమ్ ట్రైనర్ అయిన నుపూర్ శిఖారెతో డేటింగ్ చేస్తోందనే టాక్ బీ టౌన్ వర్గాల్లో ముదిరింది. గత 6 నెలలుగా వీరి మధ్య అఫైర్ నడుస్తుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సినీ గడప తొక్కకముందే ఇలా ఎన్నో కోణాల్లో ఫుల్ ఫేమస్ అయింది ఐరా ఖాన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oAWgF4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...