Tuesday, 8 December 2020

Alia Bhatt: మహేష్ గారాలపట్టి సితారపై ఆలియా భట్ లవ్.. స్పెషల్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన బ్యూటీ

మహేష్ బాబు డాటర్ ఎంత యాక్టివ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. స్టార్ డాటర్ అయినప్పటికీ చిన్నతనంలోనే హుషారైన యాక్టివీటీస్‌తో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది సితార. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో నిత్యం తన ఆట, పాటలను పోస్ట్ చేస్తూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడగట్టుకుంది. ఇకపోతే నిజజీవితంలో పెద్ద, చిన్న అందరితో కలుపుగోలుగా ఉండటం సితార నైజం. అందుకే చాలామంది సెలబ్రిటీలు ఆమెను ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే సితారపై ఉన్న ప్రేమను చాటుతూ ఆమెకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది ఆలియా భట్. బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్, సితార మంచి ఫ్రెండ్స్. సితారతో ఆలియా బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఇదేంటి.. వీళ్లిద్దరికి ఎలా కలిసింది అనేగా మీ సందేహం.. సరే అక్కడికే వద్దాం. 2018 సంవత్సరంలో 'మ‌హ‌ర్షి' షూటింగ్ నిమిత్తం మ‌హేష్ బాబు త‌న ఫ్యామిలీతో న్యూయార్క్ వెళ్లారు. అదే స‌మ‌యంలో అలియా భ‌ట్ మూవీ షూటింగ్ కూడా అక్క‌డే జరుగుతుండటంతో ఆలియా, సితార మీట్ అయ్యారు. మొదటి పరిచయంలోనే చాలా క్లోజ్ అయ్యారు. ఆ సమయంలో ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫొటో కూడా బాగా వైరల్ అయింది. Also Read: అయితే అలా పుట్టిన ఆ స్నేహాన్ని మరవని ఆలియా భట్.. RRR షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వస్తూ వస్తూ సితార కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ తెచ్చింది. త‌న సొంత బ్రాండ్ దుస్తులు సితార‌ కోసం ప్రత్యేకంగా తెచ్చి ఇచ్చిన ఆలియా.. కాసేపు ఆ చిన్నారితో సరదాగా గడిపింది. అయితే ఆ డ్రెస్ వేసుకొని మురిసిపోయిన సితార, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. నా కెంతో ఇష్ట‌మైన నా ఫేవరేట్ హీరోయిన్ అలియా భ‌ట్ ఈ డ్రెస్ తెచ్చింది. నాకు చాలా నచ్చిందంటూ ఆ డ్రెస్ ధరించి దిగిన ఫొటో షేర్ చేసింది లిటిల్ ప్రిన్స్ సితార.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Lhm9LE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...