Tuesday, 8 December 2020

బావగారు బాగున్నారంటూ రెచ్చిపోయిన నిహారిక.. కాబోయే భర్తతో మెగా డాటర్ ఎంజాయ్! వీడియో వైరల్

ప్రస్తుతం మెగా డాటర్ ఫొటోలు, వీడియోలు అలాగే మెగా సంగతులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. రేపే (డిసెంబర్ 9) నిహారిక- చైతన్య మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కానున్న నేపథ్యంలో సంబరాలు మిన్నంటాయి. మెగా ఫ్యామిలీ అంతా రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలస్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా నిన్ననే కాబోయే భర్తతో కలిసి ప్రత్యేకమైన విమానంలో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్న నిహారిక.. గత రాత్రి జరిగిన సంగీత్ ఈవెంట్‌లో ఫుల్ జోష్‌లో కనిపించింది. చైతన్యతో కలిసి చిందులేసింది. నిన్న రాత్రి ఉదయ్‌పూర్ ప్యాలస్‌లో నిహారిక సంగీత్ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా మరింత హుషారుగా కనిపిస్తూ డాన్సులేశారు. మెగాస్టార్ చిరంజీవి పాటలతో వేదిక ప్రాంగణం హోరెత్తిపోయింది. ఇక ఈ మెగా ఈవెంట్‌లో కాబోయే భార్యాభర్తలు నిహారిక- చైతన్యలు వేసిన డాన్సులు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ముఖ్యంగా 'బావగారు బాగున్నారా' సినిమాలోని ''ఆంటీ కూతురా అమ్మో అప్సరా.. ముస్తాబేదిరింది'' అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు చైనిహారిక. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: ఇకపోతే ఈ సంగీత్ కార్యక్రమంలో మెగా కాంపౌండ్ హీరోలు చేసిన రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి కూతుళ్లు శ్రీజ, సుస్మిత తెగ సందడి చేశారు. తన చెల్లి నిహారికను భుజాలపై ఎత్తుకొని స్టెప్పులేస్తూ వరుణ్ తేజ్ హుషారెత్తిపోయారు. అలాగే మెగా, అల్లు వారి చిన్నారులు సైతం డాన్సులేస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా నిహారిక పెళ్లి సంబరాలే కనిపిస్తున్నాయి. రేపు రాత్రి (డిసెంబర్ 9) వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి నిహారిక మెడలో మూడు ముళ్ళేయనున్నారు చైతన్య. ఇందుకోసం ఉదయ్‌పూర్ ప్యాలస్‌ ఎంతో అందంగా ముస్తాబైంది. మెగా సన్నిహితులతో పాటు పలువురు వెండితెర, బుల్లితెర నటీనటులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gmYODA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...