Tuesday, 8 December 2020

పాయల్ రాజ్‌పుత్ వల్ల ఆ నిర్మాత రూ.7కోట్లు నష్టపోయాడట!

‘ఆర్‌ఎక్స్ 100’తో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తొలి సినిమాతో కుర్రకారులకు సెగలు పుట్టించింది. రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో హీరో కార్తికేయతో పోటీపడటంతో యూత్ ఆ సినిమాను ఎగబడి చూశారు. దీంతో భారీ క్రేజ్ తెచ్చుకున్న పాయల్‌ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ‘’ సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ఈ సినిమాకు సి.కళ్యాణ్ నిర్మాత. Also Read: పాయల్ తొలి సినిమాను మించిపోయి ఇందులో గ్లామర్ వలకబోసింది. తొలి టీజర్‌ మొత్తం ఆ సన్నివేశాలతో నింపేసి విడుదల చేయడంతో పాయల్‌పై ఓ వర్గం నుంచి విమర్శలు వచ్చాయి. నటన కంటే గ్లామర్‌నే నమ్ముకున్నట్లుంది అంటూ ఆమెను తిట్టిపోశారు. దీంతో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడిన పాయల్ రెండో టీజర్‌లో అలాంటి సన్నివేశాలు లేకుండా చూడాలని నిర్మాత సి.కళ్యాణ్‌ను కోరిందట. దీంతో పాయల్‌కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలతో రెండో టీజర్ విడుదల చేశారు. Also Read: అయితే పాయల్‌ను గ్లామర్ డాల్‌గా చూసే ఓ వర్గం ప్రేక్షకులు ఆ టీజర్ చూసి షాకయ్యారు. దీంతో ‘ఆర్‌డీఎక్స్ 100’ సినిమా విడుదలైనప్పుడు యూత్ పట్టించుకోలేదు. రివ్యూలు సైతం నెగిటివ్‌గా రావడంతో థియేటర్లో ప్రేక్షకులే కరువయ్యారు. దీంతో నిర్మాతకు సుమారు రూ.7కోట్ల వరకు నష్టాలు వచ్చాయట. పాయల్ రిక్వె్స్ట్ వల్లే తాము అలా టీజర్ రిలీజ్ చేయాల్సి వచ్చిందని, అందువల్లే భారీగా నష్టపోయానని ఓ సందర్భంలో సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oBTaAi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...