Saturday, 26 December 2020

RED సెన్సార్ పూర్తి.. సంక్రాంతి బరిలో రామ్ పోతినేని

గతేడాది 'ఇస్మార్ట్ శంకర్'తో థియేటర్లలో పండగ వాతావరణం తీసుకొచ్చిన ఎనర్జిటిక్ స్టార్ వచ్చే ఏడాది అదే రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు రాబోయే సంక్రాంతి పండక్కి 'రెడ్' సినిమాతో థియేటర్లలో ఎంట్రీ ఇస్తున్నారు రామ్. తాజాగా సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. 'ఇస్మార్ట్ శంకర్'కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ సంగీతం అందించారు. ఈ రోజే (శనివారం) సెన్సార్ పూర్తిచేసుకొని U/A సర్టిఫికేట్ తెచ్చుకుంది RED మూవీ. నిజానికి ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని, థియేటర్లలోనే విడుదల చేయాలనే సంకల్పంతో ఇన్నాళ్లూ ఎదురు చూసిన దర్శకనిర్మాతలు తాజాగా చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అన్ని అంశాలు ఈ మూవీలో ఉంటాయని నిర్మాత స్రవంతి రవికిశోర్ అన్నారు. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతినిస్తుందని ఆయన తెలిపారు. క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేసింది. రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడం, యూట్యూబ్‌లో నెంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34KHpjK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...