Saturday, 26 December 2020

మహేష్ బాబుపై బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్.. బిగ్ బ్రదర్ అంటూ! ఇదీ సూపర్ స్టార్ క్రేజ్ అంటే..

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజే వేరు. స్టార్ వారసుడిగా కెమెరా ముందుకొచ్చినప్పటికీ తనదైన నటనతో భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. క్లాస్, మాస్ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి వర్గాన్ని ఆకట్టుకొని టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు . కాగా తాజాగా మహేష్‌పై బాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రశంసలు గుప్పించడం ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే కమర్షియల్ యాడ్ షూట్స్‌లో పాల్గొంటూ ఉంటారు మహేష్. ఈ క్రమం లోనే రీసెంట్‌గా ఓ వాణిజ్య ప్రకటన కోసం తొలిసారి బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి మహేష్ బాబు పని చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌తో తీసుకున్న ఓ ఫొటోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ర‌ణ్‌వీర్.. సూప‌ర్‌స్టార్‌ని ఓ రేంజ్‌లో పొగిడేశారు. మహీతో కలిసి పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపిన రణ్‌వీర్.. నేను కలిసి పనిచేయాలనుకునే, కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తుల్లో మహేష్ బాబు ఒకరని అన్నారు. 'మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు ఎప్పటికీ విలువైనవే. బిగ్‌ బ్రదర్‌ పట్ల నాకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు. ఈ సందేశం చూసిన మహేష్.. ''నీతో కలిసి పని చేయడం గ్రేట్ బ్రదర్.. ఇద్దరిదీ సేమ్ ఫీలింగ్'' అంటూ సూపర్ రిప్లై ఇచ్చారు. వీళ్లిద్దరి ఈ సంభాషణ చూసి ఇదీ సూపర్ స్టార్ రేంజ్ అంటూ తెగ మురిసిపోతున్నారు మహేష్ అభిమానులు. ఇకపోతే ప్రస్తుతం‌ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘83’ విడుదలకు సిద్ధంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nSrwiz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...