Saturday, 26 December 2020

మెగా రీమేక్స్‌పై చిరంజీవి ఓపెన్.. ప్రభాస్ ఏ సినిమాకు సూట్ అవుతారంటే! ఆ రోల్ మాత్రం సమంతకే..

ఆహా ఓటీటీ వేదికపై 'నాతో ఎంజాయ్‌మెంట్ మాములుగా ఉండదు' అంటూ సామ్ జామ్ ప్రోగ్రాం హోస్ట్ చేస్తోంది అక్కినేని కోడలు . పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఆసక్తికర విషయాలపై వారి వారి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన ఆమె ఆయనకు సంబంధించి అన్ని కోణాల్లో ప్రశ్నలు సంధించింది. క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అయింది. ఇందులో తన సినిమాలు ఏ హీరోలు రీమేక్ చేస్తే బెటర్ అనే ప్రశ్నపై ఇంట్రెస్టింగ్ రియాక్షన్ ఇచ్చారు . మీ సూపర్ హిట్ చిత్రాలను రీమేక్ చేయాల్సి వస్తే.. ఇప్పటి హీరోలలో ఎవరు సెట్ అవుతారని సమంత అడగడంతో వరుసగా అందరిపేర్లు చెప్పేసి ఆశ్చర్యపర్చారు చిరంజీవి. ఎవ్వరినీ నిరాశ పరచకుండా ఒక్కో హీరోకు ఒక్కో సినిమా సూట్ అవుతుందని తనదైన స్టైల్‌లో పేర్కొన్నారు. `జగదీకవీరుడు.. అతిలోకసుందరి` సినిమాను రీమేక్ చేస్తే అందులో రామ్‌చరణ్ లేదా మహేష్ బాబు బాగా సెట్ అవుతారని చెప్పిన మెగాస్టార్.. ఇందులో అతిలోక సుందరిగా సమంత మాత్రమే కనిపించాలని అన్నారు. 'ఇంద్ర' సినిమాకు సూట్ అవుతాడని, అలాగే 'ఠాగూర్' సినిమా పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందని చెప్పారు చిరు. ఇక 'ఛాలెంజ్' సినిమాకు బన్నీ లేదా విజయ్ దేవరకొండ అయితే సూపర్ అని అన్నారు. 'గ్యాంగ్ లీడర్' పాత్రలో తారక్ లేదా చరణ్ కనిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 'రౌడీ అల్లుడు' సినిమాకైతే రవితేజ లేదా బన్నీ సెట్ అవుతారని, 'విజేత' సినిమాలో పాత్ర నాగచైతన్యకు బాగా సూట్ అవుతుందని అన్నారు. అయితే తన 'స్వయం కృషి' మూవీ మాత్రం ఎవ్వరికీ సెట్ కాదని మెగాస్టార్ చెప్పడం విశేషం. ఈ విషయంలో చిరంజీవి చాతుర్యానికి ఫిదా అవుతున్నారు అందరు హీరోల ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L0CKD2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...