Thursday, 10 December 2020

Nani: నాని- సాయి పల్లవి జంటగా శ్యామ్ సింగరాయ్.. షూటింగ్ స్టార్ట్

విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీ అయిన నాచురల్ స్టార్ నాని.. మరో సినిమాను ప్రారంభించారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందనున్న '' మూవీని ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు (గురువారం) పూజా కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తండ్రి గంటా రాంబాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, వెంకీ కుడుముల, మేర్లపాక గాంధీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌‌కి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ కొట్టగా.. యువ దర్శకులు శివ నిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్ట్ అందించారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందట. ఈ చిత్రంలో నాని సరసన , 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. Also Read: పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిత్రానికి మెలోడీ సాంగ్ స్పెషలిస్ట్ మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమాతమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ఓ డిఫరెంట్ మూవీగా ఈ 'శ్యామ్ సింగరాయ్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని అంటున్నారు దర్శకనిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qKVwPi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...