Thursday, 10 December 2020

Chiranjeevi: మెగాస్టార్ టైటిల్‌తో సూపర్ స్టార్! మహేష్ బాబు న్యూ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమా టైటిల్స్‌తో మళ్ళీ కొత్తగా సినిమాలు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. కాకపోతే తాజాగా బయటకొచ్చిన ఓ అప్‌డేట్ మాత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ మూవీ టైటిల్ సూపర్ స్టార్ సినిమాకు పెడుతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. వంశీ పైడిపెల్లితో మహేష్ బాబు చేయబోతున్న సినిమా మరోసారి లైన్ లోకి రావడమే గాక, ఆసక్తికర టైటిల్ వినిపిస్తుండటం మహేష్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ ఏడాది ఆరంభంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మహేష్.. అదే జోష్‌లో ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలాఉంటే మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని విన్నాం. ఇంతలోనే అనూహ్యంగా ఓ న్యూస్ బయటకొచ్చింది. రాజమౌళితో సినిమా చేసేలోపే వంశీ పైడిపెల్లితో మూవీ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట మహేష్ బాబు. Also Read: ఈ మేరకు ఇప్పటికే వీరిమధ్య చర్చలు ముగిశాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ '' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇందులో మహేష్ బాబు పక్కా మాస్ రౌడీ పాత్రలో కనిపించనున్నారని టాక్. 'సర్కారు వారి పాట' షూటింగ్ ఫినిష్ కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు రానున్నారట మహేష్. ఇందులో నిజానిజాల సంగతేమో గానీ మెగాస్టార్ టైటిల్‌తో సూపర్ స్టార్ సినిమా అని తెలుస్తుండటం ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oCDo8v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...