Friday, 25 December 2020

Naga Babu: నాగబాబుతో అభిజీత్ మీట్.. మై బాయ్ అంటూ బిగ్ బాస్ విన్నర్‌పై మెగా బ్రదర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్ బాస్ రియాలిటీ షోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. సీజన్ 1 మొదలుకొని రీసెంట్‌గా ఫినిష్ అయిన బిగ్ బాస్ సీజన్ 4 వరకు బుల్లితెర ప్రేక్షకులు ఈ షోకి నీరాజనం పలికారు. దీంతో అత్యధిక టీఆర్పీతో బిగ్ బాస్ దూసుకుపోయింది. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ జనాల్లో ఫుల్ పాపులారిటీ దక్కడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముగిసిన బిగ్ బాస్ 4లో విన్నర్‌గా నిలిచిన .. హౌస్ నుంచి బయటకొచ్చాక మర్యాద పూర్వకంగా మెగా బ్రదర్ నాగబాబును కలిశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ బిగ్ బాస్ విన్నర్ అభిజీత్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు . బిగ్ బాస్ షో చరిత్రలోనే ఇతనే బెస్ట్ కంటెస్టెంట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ''బిగ్ బాస్ నాలుగు సీజన్లలో బెస్ట్ కంటెస్టెంట్ నువ్వే మై బాయ్.. నీ కాన్ఫిడెన్స్, కూల్‌నెస్‌తో ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నావు. అందులో నేను కూడా ఉన్నాను'' అని ట్యాగ్ చేశారు మెలగ బ్రదర్. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సీజన్‌ కంటెస్టెంట్లందరిలో అభిజీత్ టైటిల్ విన్నర్ అవుతాడని గత కొన్ని రోజులముందే ఊహించిన నాగబాబు అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రియాలిటీ షోలో అభిజీత్ ఆడే విధానం చాలా బాగా నచ్చిందని, ఎప్పుడూ ఎంతో కూల్ అండ్ కామ్‌గా కనిపిస్తాడని చెబుతూ ఆ సమయంలో అభిజీత్‌కి మంచి హైప్ ఇచ్చారు మెగా బ్రదర్. అది గుర్తుపెట్టుకొనే హౌస్ నుంచి బయటకు రాగానే నాగబాబును మర్యాదపూర్వకంగా కలిశారు అభిజీత్. బిగ్ బాస్ సీజ‌న్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి 106 రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో 19 మంది కంటెస్టెంట్స్‌తో పోటీప‌డి టైటిల్‌ గెలుచుకున్నారు అభిజీత్. సింపుల్‌, సిన్సియ‌ర్ అండ్ జెన్యూన్‌ పర్సన్‌గా పేరు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. ప్రస్తుతం అభిజీత్ పలు ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ అనుభవాలు పంచుకుంటూ బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38DWZip
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...