Friday, 11 December 2020

Dilip Kumar Birth Day: దిగ్గజ నటుడి ప్రేమను పొందటం గర్వంగా ఫీల్ అవుతున్నా.. షారుఖ్ ఖాన్ భావోద్వేగం

ప్రస్తుతం బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఇటీవలే దిలీప్ కుమార్ సోదరులు అషాన్, అస్లమ్ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దిలీప్ వయసు మీద పడటంతో కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సతీమణి సైరా భాను స్వయంగా వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో నేడు (డిసెంబర్ 11) దిలీప్ కుమార్ 98వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు . దిలీప్ కుమార్‌తో తాను దిగిన ఫొటో షేర్ చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు షారుఖ్. ''కేవలం తన టాలెంట్‌తో ప్రపంచంలోని అందరికీ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి దిలీప్ కుమార్. దిగ్గజ నటుడికి జన్మదిన శుభాకాంక్షలు. మిమ్మల్ని కలిసిన ప్రతి అనుభవం కొత్త అనుభూతినిచ్చింది. ప్రతి సందర్భంలోనూ నాపై మీరు కురిపించిన ప్రేమ మరువలేనిది. మీరంటే నాకెంతో ఇష్టం. మీలాంటి మహోన్నత వ్యక్తి ప్రేమను పొందటం గర్వంగా ఫీల్ అవుతున్నా'' అని పేర్కొన్నారు షారుఖ్ ఖాన్. Also Read: దిలీప్ కుమార్ జన్మదిన వేడుకలను ప్రతి ఏడాది భార్య సైరా భాను, ఆయన కుటుంబం అంతా ప్రత్యేకంగా జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది దిలీప్ కుమార్ ఇంట విషాదం నెలకొనడంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో కుటుంబమంతా జన్మదిన వేడుకలకు దూరంగా ఉంది. కాగా ఆయన ఆరోగ్యం కుదుటపడి వందేళ్ల పుట్టిన రోజును జరుపుకోవాలని ఆయన శ్రేయోభిలాషులు, పలువురు సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oIUYaZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...