గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా మొత్తం మెగా డాటర్ విశేషాలతో మార్మోగిపోయింది. తెలుగు సినీ ఇండస్ట్రీని శాంసించే కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లి కావడంతో టాలీవుడ్‌లోనూ ఈ పెళ్లి గురించే చర్చ. నిహారికను పెళ్లి కూతురిని చేసిన దగ్గర నుంచి వివాహం వరకు ఎంతో ఆర్భాటంగా జరిగిన ఈ వేడుక గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగా హీరోలందరూ ఈ పెళ్లి సందడి చేయడంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు సైతం ఈ పెళ్లి గురించి గొప్పగా చెప్పుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితరులందరూ మూడు రోజుల ముందే ఉదయ్‌పూర్ చేరుకోగా.. పెళ్లికి ముందు రోజు పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరా నందన్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి సందర్భంగా మెగా హీరోలందరూ నిహారికకు ఖరీదైన బహుమతులు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.5-6కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తన కూతురి పెళ్లి కోసం నాగబాబు సుమారు రూ.3కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిలో నిహారిక కట్టుకున్న చీర గురించి ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాని ఖరీదు తెలుసుకుని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. బంగారు తీగలతో తయారుచేసిన ఈ చీర ఖరీదు ఏకంగా రూ.20లక్షలంట. పెళ్లికి నెల రోజులు ముందే ఈ చీరను ఆర్డర్ చేసి ప్రత్యేకంగా తయారు చేయించారట. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీ పెద్దలను ఆహ్వానించలేదు. అయితే వారందరికీ కోసం త్వరలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారట. హోదా తగినట్లుగా పెళ్లి వేడుకను మించేలా రిసెప్షన్ భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2W3HAlw
v
No comments:
Post a Comment