రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకుంటున్నారు రౌడీ స్టార్ . కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో విజయ్ మిడిల్ క్లాస్ ఫండ్ రైజ్ చేసి నిత్యావసర సరుకులు కొనడానికి ఇబ్బందులు పడిన కొన్ని కుటుంబాలను ఆదుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సాయం పొందిన అనే దివ్యాంగురాలు కృతజ్ణతా భావంగా నోటితో పెన్సిల్ పట్టి విజయ్ బొమ్మ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసి ఫిదా అయ్యారు విజయ్ దేవరకొండ. Also Read: విజయ్ దేవరకొండ చిత్రాన్ని నోటితో గీస్తున్న వీడియోని షేర్ చేసిన స్వప్నిక.. ఆయన చేసిన సాయానికి గాను ధన్యవాదాలు తెలిపింది. ఆకలితో ఉన్నాము అంటే కరోనా టైమ్‌లో నా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టిన దేవుడు మీరు అంటూ స్వప్నిక కృతజ్ణతలు తెలిపింది. అయితే నోటితో పెన్సిల్ పట్టి తన చిత్రాన్ని గీస్తున్న స్వప్నిక వీడియా చూసిన విజయ్ రిప్లై ఇస్తూ ''లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నికా.. నువ్వు మా అందరికీ స్ఫూర్తిదాయకం'' అంటూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో స్వప్నిక పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె టాలెంట్ చూసి అంతా మెచ్చుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gBcoDq
v
No comments:
Post a Comment