Monday, 21 December 2020

జగన్‌ను ఆకాశానికి ఎత్తేసిన చిరంజీవి.. బర్త్ డే రోజు స్పెషల్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ సెలబ్రిటీలంతా సీఎంకు విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి... జగన్‌కు బర్త్ డే విషెస తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌పై చిరు ప్రశంసలు కురిపించారు. ‘ డైనమిక్ యువ నాయకుడు @ వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంకల్పాన్ని, లక్ష్యాలను గ్రహించడంలో మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. మీకు మరింత అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మీరు మరిన్ని రోజులు ప్రజలకు ఈ విధంగా సేవా చేయాలని కోరుకుంటున్నా’ అంటూ చిరు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. Read More: సీఎం జగన్ అయ్యాక సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి చిరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అప్పట్లో చిరు నటించిన సైరా నర్సింహారెడ్డి సినిమా చూడాలని జగన్‌ను కోరారు చిరు. ఏదీ ఏమైనా మెగాస్టార్ విషెస్‌తో వైసీపీ శ్రేణులు పుల్ జోష్‌లో ఉన్నారు. చిరంజీకి ధన్యవాదాలు తెలిపారు. చిరుతో పాటు.. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకంక్షలు తెలిపారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మంచు విష్ణు, నిర్మాత బండ్ల గణేష్ జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. అటు ఏపీలో కూడా వైసీపీ శ్రేణులు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3arp5Qp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...